Monday, April 21, 2025

ఐపిఎల్ లొ చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..

- Advertisement -
- Advertisement -

యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపిఎల్ లో చరిత్ర సృష్టించాడు. అతి పిన్న వయసు (14 ఏళ్ల 23 రోజులు)లో అరంగేట్రం చేసిన ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ప్రయాస్ రే బర్మన్ (16 ఏళ్ల 157 రోజులు) పేరిట ఈ ఘనత ఉన్నది. మెగా వేలంలో వైభవన్ ను రాజస్థాన్‌ రాయల్స్‌.. రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయసు క్రికెటర్ గానూ వైభవ్ అరుదైన ఘనత సాధించాడు. కాగా, శనివారం లక్నో సూపర్ గెయింట్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్.. తొలి బంతినే సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్ లో 20 బంతులు ఎదర్కొన్కన వైభవన్ రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్ లో లక్నో అనూహ్య విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగుల తేడాతో రాజస్థాన్ ను ఓడించింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ మార్‌క్రమ్ (66), అయుష్ బడోని (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సమద్ 10 బంతుల్లోనే 4 సిక్స్‌లతో అజేయంగా 30 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News