- Advertisement -
బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపిఎల్ మెగా వేలంలో 13 ఏళ్లకే జాక్‌పాట్ కొట్టేశాడు. వైభవ్ కనీస ధర రూ.30 లక్షలు. అయితే అతన్ని సొంతం చేసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. 2024లోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన వైభవ్ అసాధారణ ఆటతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. 2011లో జన్మించిన వైభవ్ చిన్న వయసులో అసాధారణ బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటికే రంజీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.
- Advertisement -