Thursday, December 19, 2024

పనివాళ్లకు కోట్లాది రూపాయల షేర్లు దానం

- Advertisement -
- Advertisement -

ఐడిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్ దొడ్డ మనస్సు

చెన్నై: ఐడిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ వైద్యనాథన్‌ది పెద్ద మనస్సు. ఎన్నికోట్లు దానం చేసినా ఎవరికీ చెప్పడు. తన దగ్గర పనిచేసే వాళ్లను తన వాళ్లుగా నమ్మే వ్యక్తి. 2018లో ఆయన దాదాపు రూ. 20 కోట్ల షేర్లను ఉద్యోగులు, కారు డ్రైవర్, పనివాళ్లకి 9 లక్షల షేర్లు లేక తన హోల్డింగ్స్ లోని 3.7 శాతం షేర్లు రాసిచ్చారు. ఆ విషయం ఆయన చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా వెలుగుచూసింది. తన చిన్నతనంలో రూ. 500 ఇచ్చి సాయపడిని సైనీ మాస్టర్‌కు రూ. 30 లక్షల విలువైన షేర్లను ఆయన బదిలీ చేయడం మరో విశేషం. 2021లో రూ. 2.5 కోట్లు విలువ చేసే షేర్లని మరో ముగ్గురు పనివాళ్లకు ఇచ్చాడు. తాజాగా బ్యాంకు ఉద్యోగి ఒకరు మరణించగా ఆయన కుటుంబానికి 5లక్షల షేర్లను ఆర్థిక సాయంగా ఇచ్చాడు. వాటి విలువ రూ. 2.1 కోట్లకు పైబడే ఉంటుంది. అలాగని ఐటి రిటర్ను దాఖల్లో ఈ దానం నమోదే చేయడు. అవన్నీ ఆయన సొంత షేర్లేనని ఐడిఎఫ్‌సి ఫస్ట్ కూడా ప్రకటించింది.

వైద్యనాథన్ చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టాడు. తండ్రి ఆర్మీ ఉద్యోగి. వైద్యనాథన్ ప్రభుత్వ బడిలోనే చదివాడు. ఝార్ఖండ్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన బిటెక్ చేశాడు. అప్పుడే ఆయన లెక్కల ట్యూషన్ టీచర్ సైనీ ఐదొందల రూపాయలు ఇచ్చి ఝార్ఖండ్‌కు పంపాడు. ఆ తర్వాత వైద్యనాథన్ బోస్టన్ వెళ్లి హార్వర్డ్ యూనివర్శిటీలో అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివాడు. స్వదేశానికి తిరిగొచ్చాక సిటీ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. తర్వాత ఐసిఐసిఐ బ్యాంకులో చేరాడు. అక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. కొన్నాళ్లకి ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ క్యాపిటల్ హోల్డింగ్స్ అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ సిఈవోగా చేరాడు. సంస్థ నష్టాన్ని భరించలేక కిశోర్ బియానీ దానిని అమ్మేయాలనుకున్నాడు. కానీ వైద్యనాథన్ దాన్ని నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డాడు. ఓరోజు విమాన ప్రయాణంలో ఓ ఇన్వెస్టర్ పరిచయం కాగా ఆయనతో పెట్టుబడి పెంట్టించాడు. తర్వాత ఆ ఎన్‌బిఎఫ్‌సిని క్యాపిటల్ ఫస్ట్‌గా పేరు మార్చాడు. ఆ తర్వాత ఐడిఎఫ్‌సితో చేతులు కలిపి దానిని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంకుగా మార్చాడు. వైద్యనాథన్ ఎండి, సిఇఒగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్నో దానధర్మాలు చేస్తున్నాడు. ఆపన్నులకు వైద్య సాయం కూడా అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News