నిజామావాద్ సిటీ: నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ తరహాలో అత్యంత అధునాతనంగా పచ్చదనం విరజిల్లేలా ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు నిర్మించడం జరుగుతుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. శనివారం నగరంలో నిర్మిస్తున్న దుబ్బ, అర్సపల్లి వైకుంఠ ధామాలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. చివరి మజిలీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రత్యేక డిజైన్లతో వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నారనితెలిపారు.
స్మశాన వాటిక అంటేనే భయం,ఆందోళనలాంటి అనుభూతి కలగకుండా ఎక్కడ చూసినా పచ్చదనం, అందమైన విద్యుత్‌దీపాల అలంకరణలతో ఆకర్షణీయంగా నిర్మాణం జరుగుతోందన్నారు. త్వరలో ఐటి, పట్టణాభివృద్ధిశాఖ మంత్రివర్యులు కెటి రామారావు ఈ వైకుంఠ ధామాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.