Thursday, December 26, 2024

శ్రీవారి భక్తులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

శ్రీవారి భక్తులకు నిజంగా ఇది శుభవార్తే. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. 40 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా శాఖల అధికారులందరు చేయాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం పలు సూచనలు చేశారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.

వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు. ఈ పది రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు, – జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలు రద్దు, – జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు, – జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News