Sunday, November 24, 2024

ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి?

- Advertisement -
- Advertisement -

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ‘మాసాలలో నేను మార్గశిర మాసాన్ని’ అని దీనికి అర్ధం. అన్ని మాసాలలోనూ మార్గశిర మాసానికి ఎంతో విశిష్టత ఉందని దీనినిబట్టి తెలుస్తుంది. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతకరమైన మాసం మార్గశిరం. ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి విష్ణువుకు మహా ప్రీతికరం. ముక్కోటి ఏకాదశినాడు విష్ణువు మూడు కోట్ల దేవతలతో సహా భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడు. ఆ రోజు శ్రీమహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని ప్రతీతి. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సర కాలంలో వచ్చే 24 ఏకాదశులలోకీ శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనది. ఈ రోజు వైకుంఠ ఏకాదశ వ్రతం కూడా జరుపుకుంటారు. వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి, నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కల్పించాడని చెబుతారు.

ఒక సందర్భంలో దేవతలను రాక్షసులు నానా హింసలకూ గురి చేస్తూ ఉంటారు. వారి బాధలను తట్టుకోలేక దేవతలందరూ కలసి, శ్రీమహా విష్ణువుతో మొర పెట్టుకునేందుకు వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి వెళ్లి విష్ణుమూర్తితో తమ బాధలు చెప్పుకుంటారు. వారిని స్వామివారు అనుగ్రహించి, రాక్షసులను వధించి దేవతలకు సాంత్వన  చేకూరుస్తాడు. దేవతలంతా కలసి విష్ణుమూర్తిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడంవల్ల ఆ రోజు వైకుంఠ ఏకాదశిగాను, మూడు కోట్ల మంది దేవతలతో కలసి స్వామివారు భూలోకానికి విచ్చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు కాబట్టి ముక్కోటి ఏకాదశిగానూ ఈ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News