Friday, January 10, 2025

యాదగిరిగుట్ట, భద్రాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదగిరిగుట్ట, భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారామస్వామిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటున్నారు. గరుడవాహనంపై శ్రీరామ చంద్రుడు, గజ వాహనంపై సీతమ్మను భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి యాదాద్రీశుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. ఇవాళ స్వామివారికి గరుడ సేవోత్సవం, తిరువీధిసేవ ఉరేగుతుంది. యాదాద్రిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వ దర్శనాలు ఉన్నాయి. నేటి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరి గుట్టలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆరు రోజుల పాటు అలంకార సేవల్లో దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చిస్తే మూడు కోట్ల ఏకాశదులు పుణ్యమని ప్రతీతి ఉంది. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని భక్తుల విశ్వాసం ఉండడంతో భారీగా తరలివస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News