Monday, March 10, 2025

వైశాలికి కాంస్యం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో భారత్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. వైశాలి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైన్‌లో జు జినార్(చైనా)పై 2.5-1.5 తేడాతో గెలుపొందిన అనంతరం సెమీస్‌లో వైశాలి జు వెంజన్(చైనా) చేతిలో 0.5-2.5 తేడాతో పరాజయంపాలైంది. ఆరు రోజుల పాటు ఈ పోటీల్లో ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో భారత్ నుంచి ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపవన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరాఘవన్ ఇక మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హరిక, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మి రౌత్, దివ్య, నూతక్కి ప్రియాంక హాజరయ్యారు. కాగా, కాంస్యం సాధించిన ఈ యువ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు స్వయాన సోదరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News