Wednesday, January 1, 2025

నవీన్‌రెడ్డి ప్రెండ్ మాత్రమే.. కారులో నన్ను మస్త్ కొట్టిండు: వైశాలి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: నిన్నటి కిడ్నాప్ కేసు ఘటన వివరాలను బాధితురాలు బిడిఎస్ విద్యార్థిని వైశాలి వెల్లడించింది. మీడియాతో వైశాలి మాట్లాడుతూ… నిన్న మా ఇంటిపై దాడి చేసి ఇంట్లో నుంచి నన్ను లాక్కెళ్లారు. కారులో తీసుకెళ్తూ నవీన్ రెడ్డి నన్ను తీవ్రంగా కొట్టాడు. చెప్పినట్లు వినకుంటే మా నాన్నను చంపేస్తానని బెదిరించాడు.

నవీన్ రెడ్డితో నాకు పెళ్లి కాలేదని వైశాలి పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని బంధువుతో సంప్రదిస్తే ఇష్టం లేదని చెప్పాను. పెళ్లి అయ్యిందని చెప్పిన రోజున నేను ఆర్మీ ఆస్పత్రితో ఉన్నానని తెలిపింది. నా జీవితాన్ని నాశనం చేస్తానని నవీన్ రెడ్డి బెదిరించాడని వాపోయింది. నవీన్ రెడ్డి నుంచి నాకు భద్రత కల్పించాలని వైశాలి పోలీసులను కోరింది. నాకు సంబంధం లేకుండానే కారు బీమాలో నా పేరు నామినీగా పెట్టాడని వెల్లడించింది. ఫేక్ ఇన్ స్టాగ్రాం ఖాతాలో నా మార్ఫింగ్ పోటోలు అప్ లోడ్ చేశాడని వైశాలి పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News