Wednesday, January 22, 2025

న‌వీన్ రెడ్డివి అన్ని అబ‌ద్దాలే.. అత‌నితో పెళ్లి కాలేదు : వైశాలి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని మ‌న్నెగూడ‌కు చెందిన ఓ యువ‌తిని కిడ్నాప్ చేసిన ఘ‌ట‌న‌ తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ కిడ్నాప్ వ్య‌వ‌హారంలో నిన్న‌టి నుంచి గంట‌కో గంట‌కో విష‌యం వెల్ల‌డైంది. బాధితురాలి త‌ల్లిదండ్రులు, కిడ్నాప్ చేసిన న‌వీన్ రెడ్డి కుటుంబ స‌భ్యులు ప‌లు ర‌కాలుగా స్పందించారు. ఎట్ట‌కేల‌కు కిడ్నాప్ అయిన డెంట‌ల్ డాక్ట‌ర్ వైశాలి శ‌నివారం రాత్రి మీడియా ముందుకు వ‌చ్చారు.

వైశాలి మాట‌ల్లోనే..

నిన్న మా ఇంటికి వ‌చ్చిన న‌వీన్ రెడ్డి గ్యాంగ్‌.. బ‌ల‌వంతంగా న‌న్ను లాక్కెళ్లారు. మా అమ్మ‌నాన్న‌తో పాటు ఇత‌రుల‌పై దాడి చేశారు. ఓ పది మంది న‌న్ను ఇంట్లో నుంచి లాక్కెళ్లి కారులో తోసేశారు. కారులో న‌వీన్ రెడ్డితో పాటు మొత్తం ఆరుగురు ఉన్నారు. హెల్ప్ హెల్ప్ అని గ‌ట్టిగా అరిచాను. అరిస్తే మీ నాన్న‌ను అక్క‌డ చంపేస్తామ‌ని బెదిరించారు. కారులో న‌న్ను న‌వీన్ రెడ్డి ఘోరంగా ట్రీట్ చేశారు. దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు.

ఆ రోజు ఆర్మీ కాలేజీలో ఉన్నాను..

అయితే న‌వీన్ రెడ్డికి, త‌న‌కు పెళ్లి అయింద‌ని మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా వైశాలి స్పందించారు. న‌వీన్ రెడ్డికి, నాకు వివాహం జ‌ర‌గ‌లేదు. మాకు పెళ్లైన‌ట్లు ఒక డేట్(2021, ఆగ‌స్టు 4) ఇచ్చారు. అస‌లు ఆ డేట్ రోజు నేను ఆర్మీ కాలేజీలో డెంట‌ల్ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను. ఆ ఆధారాలు కూడా మీకు చూపిస్తాను. ఏ ఆధారాలు లేకుండా మాట‌ల‌తో అంద‌ర్నీ న‌మ్మించాల‌ని చూస్తున్నారు.

ఆ ఫోటోలు మార్ఫింగ్..

న‌వీన్ రెడ్డితో ఎప్పుడు కూడా నేను ఫోటోలు దిగ‌లేదు. నా ఫ్రెండ్‌తో దిగిన ఫోటోల‌ను న‌వీన్ మార్ఫింగ్ చేసి వైర‌ల్ చేస్తున్నాడు. గ‌తంలో ఇన్‌స్టా గ్రామ్‌లో కూడా నాపేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి, మార్ఫింగ్ ఫోటోల‌ను అప్ లోడ్ చేశాడు. అప్పుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. ఫేక్ అకౌంట్ అని తేలింది. న‌వీనే అకౌంట్ క్రియేట్ చేశాడ‌ని కూడా పోలీసులు తెలిపారు. అత‌ని ఫోన్ సీజ్ చేయ‌మ‌ని చెప్పారు. కానీ సీజ్ చేశారో లేదో తెలియ‌దు. పెట్టిన ప్ర‌తి ఫోటో మార్ఫింగే. నా ఫోన్‌ను ప‌గుల‌గొట్టాడు.

నీకు ఇష్టం లేక‌పోతే ఏంది..?
నువ్వంటే ఇష్టం లేద‌ని ప‌లుమార్లు చెప్పాను. నీకు ఇష్టం లేక‌పోతే ఏంది.. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఇంకొక‌రిని ఎలా పెళ్లి చేసుకుంటావు అని న‌వీన్ వాదించాడు. నాకు ఇష్టం కాబ‌ట్టి తెచ్చుకున్నాను. ఆ స‌మ‌యంలో కంటిపై కొట్టాడు. తీవ్రంగా హింసించాడు.

బ్యాడ్మింట‌న్ కోర్టులో ప‌రిచ‌యం..

లాక్‌డౌన్ స‌మ‌యంలో నేను ఫ్రెండ్స్‌తో క‌లిసి బ్యాడ్మింట‌న్ ఆడేందుకు వెళ్లే వాళ్లం. మొద‌ట వేరేవాళ్ల‌తో న‌వీన్ బ్యాడ్మింట‌న్ ఆడేవాడు. రెండు, మూడు నెల‌ల త‌ర్వాత మా ద‌గ్గ‌రికి వ‌చ్చి న‌వీన్ రెడ్డి ప‌రిచ‌యం చేసుకున్నాడు. మ‌ళ్లీ రెండు నెల‌ల త‌ర్వాత నువ్వంటే ఇష్ట‌మ‌ని చెప్పాడు. కానీ నేను అంగీక‌రించ‌లేదు. మా పేరెంట్స్ వ‌చ్చి అడ‌గ‌మ‌ని చెప్పాను. కానీ అత‌ను నా వెంట ప‌డుతూనే ఉన్నాడ‌ని వైశాలి వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News