Friday, April 18, 2025

లవ్‌తోపాటు ఫ్యామిలీ డ్రామా..

- Advertisement -
- Advertisement -

Vaishnav Tej interview about 'Ranga Ranga Vaibhavanga'

పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
యూత్‌ఫుల్‌గా, ఫ్యామిలీ డ్రామాతో…
ఈ సినిమాలో నేను ఎంబిబిఎస్ స్టూడెంట్‌గా కనిపిస్తాను. సినిమాలో యూత్‌కి నచ్చే ఎలిమెంట్స్ , రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. యూత్ ఫుల్‌గా ఉంటూనే ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమా ఇది.
ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి…
ఈ కథ వినగానే బాగా నచ్చింది. ఇలాంటి కథ వచ్చి చాలా రోజులైంది అనిపించింది. లవ్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా ఉండే ఇలాంటి కథలు కాస్త అరుదుగా వస్తుంటాయి. కథ వినేటప్పుడు నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. అందుకే ఈ సినిమాచేశాను.
మంచి వినోదాన్నిచ్చే చిత్రం…
ఈ సినిమాలో థియేటర్స్‌లో ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. మంచి లవ్ ట్రాక్, ఎంటర్‌టైన్‌మెంట్, బ్యూటిఫుల్ సాంగ్స్, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ఇగో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
నేర్చుకుంటూనే ఉంటాను…
నేను లర్నింగ్ యాక్టర్‌ని. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూ ఒక్కో సినిమా చేసుకుంటూ… ప్రతి సినిమా నుండి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూ ముందుకెళ్తాను.
నెక్స్ సినిమా…
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నెక్స్ సినిమా చేయబోతున్నాను. శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా యాక్షన్, మాస్ కమర్షియల్ సినిమాగా ఉండబోతుంది.

Vaishnav Tej interview about ‘Ranga Ranga Vaibhavanga’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News