మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బుచ్చిబాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత అందించాడు. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక సినీ ప్రముఖులు, మెగా అభిమానుల మధ్య హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ ఫంక్షన్‌కు ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీశ్ శంకర్, గోపిచంద్ మలినేని, బాబీ, సందీప్ వంగా, శివ నిర్వాణ, కిషోర్ తిరుమల, వెంకీ కుడుముల విశిష్ట అతిధులుగా హాజరయ్యారు.. సుకుమార్, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్ శ్యామ్ దత్, కళా దర్శకులు రామకృష్ణ, మౌనిక, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సిఇఓ చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అశోక్, అనిల్, నటుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలోని ఒక్కోపాటను దర్శకులు ఆవిష్కరించారు. ‘ఉప్పెన‘ న్యూ ట్రైలర్‌ను హరీశ్ శంకర్ రీ లాంచ్ చేశారు. ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లలో విడుదల కానున్న ‘ఉప్పెన‘ ఫస్ట్ టికెట్‌ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఉప్పెన సినిమా అద్భుతమైన దృశ్యకావ్యంలా ఉంది. బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అన్ని అంశాలు పర్ఫెక్ట్‌గా రాసుకున్నాడు. కథ చెప్పినదానికంటే గొప్పగా ఎమోషన్స్ సీన్స్ అన్నీ కట్టిపడేసేలా అతను ఈ సినిమాను చిత్రీకరించాడు. ఇందులో స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. ఈ చిత్రంలో అత్యద్భుతంగా నటించిన వైష్ణవ్ తేజ్ మా మెగా ఫ్యామిలీకి, నాకు గర్వకారణం. దేవిశ్రీప్రసాద్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే సాంగ్స్ కంపోజ్ చేసాడు.
‘నీ కన్ను నీలి సముద్రం’ పాటతో వండర్స్ క్రియేట్ చేసాడు. అలాంటి ఈ సినిమా పెద్డ హిట్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అని అన్నారు. హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను హీరో కాదు. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేసానంతే. కథే మెయిన్ హీరో అని తెలిపారు. చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. చిరంజీవిని కలిసి నాలుగు గంటల పాటు ఈ సినిమా కథ చెప్పడం నా జీవితంలో మర్చిపోలేను. వైష్ణవ్ తేజ్ కళ్ళకు లవ్‌లో పడిపోయాను. పవన్ కళ్యాణ్‌లా అతను పెద్ద స్టార్ అవుతాడు”అని అన్నారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మాట్లాడుతూ… సినిమా చాలా బాగా వచ్చింది. చిరంజీవి ఈ సినిమా చూసి చాలా గొప్ప సినిమా తీశారు అని ప్రశంసించారు. వైష్ణవ్ తేజ్‌కి ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది” తెలిపారు.