- Advertisement -
జమ్మూ: ప్రముఖ పుణ్యక్షేత్రం మాతా వైష్ణోదేవి ఆలయ ప్రధాన పూజారి అమీర్ చంద్ శనివారం జమ్మూ కశ్మీరులోని రియాసి జిల్లా కట్రాలోని తన స్వగృహంలో కన్నుమూశారు. 85 సంవత్సరాల అమీర్ చంద్ గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. బాల్‌గంగాలో ఆయన భౌతికకాయానికి దహన సంస్కారాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మాతా వైష్ణోదేవి ఆలయ ప్రధాన పూజారి మృతి పట్ల లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు చైర్మన్ కూడా అయిన మనోజ్ సిన్హా సంతాపం ప్రకటించారు.
- Advertisement -