Friday, January 10, 2025

నాలుగు నెలల్లో వైశ్య సదన్ ను వినియోగంలోకి తీసుకురావాలి

- Advertisement -
- Advertisement -

Vaishya Sadan should be brought into use within four months

సిద్దిపేట: వచ్చే నాలుగు నెలల్లో వైశ్య సదన్ ను వినియోగంలోకి తీసుకురావాలనీ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట పురపాలక సంఘం పరిధిలో జి+1 విధానంలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్ ను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే రూ.2.6 కోట్లతో దీని నిర్మాణం చేపట్టగా , ఆ నిధులు సరిపోక పోవడంతో మరో 2 కోట్లు నిధులు మంత్రి మంజూరు చేశారు. సదన్ ప్రధాన పనులు ఇప్పటికే పూర్తి కాగా పెండింగ్ పనులైన ఆర్చ్, గేట్, ప్రవారీ, ఫాల్స్ సీలింగ్ తదితర అన్ని పనులు పూర్తి చేసి… సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, కమిషనర్ రవీందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News