Monday, December 23, 2024

హనుమకొండలో విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

 

వరంగల్: డిగ్రీ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు కలిసి ములుగు జిల్లా పర్యటనకు వెళ్లి వస్తుండగా ఒక విద్యార్థినిపై ఆమె స్నేహితుడు అత్యాచారం చేసిన సంఘటన హనుమకొండ రింగ్ రోడ్డు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు, ములుగు జిల్లాకు ఒక విద్యార్థి, వరంగల్ జిల్లా చెందిన ఒక విద్యార్థి, మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా వాజేడుకు ఆదివారం వెళ్లారు. అక్కడ ప్రకృతిని అస్వాదిస్తూ, సెలయేర్లు చూసి ఆనందంగా గడిపారు.

Also Read: బండి సంజయ్ కు వంద కోట్లు ఎక్కడివి?

సాయంత్రం తిరిగి వరంగల్‌కు ప్రయాణమయ్యారు. హనుమకొండ జిల్లా కోమటిపల్లిలోరి రింగ్ రోడ్డుకు వచ్చిన అందరు విశాంత్రి తీసుకున్నారు. అదే సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్ విద్యార్థి మాట్లాడుదామని చెప్పి వరంగల్‌కు చెందిన విద్యార్థినిని కొంచెం దూరం బైక్‌పై తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి వదిలి వెళ్లిపోయాడు. మిగతా స్నేహితులు ఆమెను వరంగల్‌లో ఆమె ఇంటికి చేర్చారు. జరిగిన విషయం ఆమె తన తల్లిదండ్రులతో చెప్పడంతో వారు కెయు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News