- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : వరంగల్ జిల్లా ములుగు లోని మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, కమిషనర్ పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ అనిత రామచంద్రన్‌లు దర్శించుకున్నారు.
ఈ మేరకు శుక్రవారం నాడు సమ్మక్క సారలమ్మ లకు తులాభారం ద్వారా నిలువెత్తు బంగారం (బెల్లం), పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి, దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వాకాటి కరుణ, అనిత రామచంద్రన్‌లు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ లు చాలా మహిమ గల దేవతలు అని గతంలో స్వయంగా జాతర నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు, ప్రజలందరూ బాగుండాలని, సమ్మక్క సారలమ్మ దేవతలను కోరుకున్నట్లు వారు తెలిపారు. వారి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -