Monday, December 23, 2024

డైమండ్ నెక్లెస్ కొట్టేసిన ఎలుక (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఇళ్లు, దుకాణాలలో దొంగతనాలు చేసి సిసి టివి కెమెరాలకు ఇక్కిన దొంగలను మనం చాలా మందినే చూస్తుంటాం. అలా దొరికిన దొంగలకు శిక్షలు కూడా పడుతుంటాయి. అయితే ఒక నగల దుకాణంలో వజ్రాల నెక్లెస్‌ను కొట్టేసిన ఎలుకను పట్టుకోవడం పోలీసులకు అసాధ్యంగా మారింది. దొంగతనం చేస్తూ సిసి టివి కెమెరాలకు చిక్కినప్పటికీ ఆ ఎలుకను ఎలా పట్టుకోవాలో అర్థంకాక పోలీసులు తలబద్దలు కొట్టుకుంటున్నారు. రాజేష్ హిన్‌గన్‌కర్ అనే ఐపిఎస్ అధికారి ఒకరు ట్విటర్‌లో షేర్ చేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షమందికి పైగా ఈ వీడియోను చూడడమేకాక ఆ ఎలుక చేసిన పనికి షాక్ అయ్యారు. వ్యాలెంటైన్స్ డే కోసం తన గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వడానికి ఆ ఎలుక డైమండ్ నెక్లిస్ చోరీ చేసి ఉంటుందని కూడా నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. బంగారం షాపులో డిస్‌ప్లేలో ఉంచిన డైమండ్ నెక్లెస్‌ను ఒక దొంగ ఎలుగ ఎలా లాఘవంగా చోరీ చేసిందో మీరూ ఈ వీడియోలో చూసెయ్యండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News