Monday, December 23, 2024

గొప్ప అనుభూతినిచ్చే చిత్రం

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహంచిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ మాట్లాడుతూ “ఖాకీ సినిమా చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఎంజాయ్ చేశారో దాని కంటే గొప్ప అనుభూతి ‘వలిమై’ సినిమా చూసినప్పుడు కలుగుతుంది. నిర్మాత బోనీకపూర్ సపోర్ట్‌తో భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించాం”అని అన్నారు. నిర్మాత బోనీకపూర్ మాట్లాడుతూ “హీరో అజిత్, దర్శకుడు వినోద్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సినిమా నాకు అద్భుతమైన జర్నీ. ఇక కార్తికేయ చూడటానికి సింపుల్‌గా, కూల్‌గా కనిపిస్తున్నాడు. కానీ స్క్రీన్‌పై బబ్బర్ షేర్‌లా నటించాడు”అని తెలిపారు. కార్తికేయ మాట్లాడుతూ “వినోద్ దర్శకత్వంలో అజిత్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. బోనీకపూర్ ఎంత గొప్ప నిర్మాతో ఆయనతో పనిచేసిన తర్వాత అర్థమైంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుమా ఖురేషి, గోపీచంద్ ఇనుమూరి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News