Wednesday, December 25, 2024

భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించిన కాంగ్రెస్ నేత

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: భార్యను చంపి గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేయడంతో  నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేత రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డికి గత సంవత్సరం వివాహం జరిగింది. ఇద్దరు మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. భార్యను ఇంట్లోనే చంపేసి గుండెపోటుతో చనిపోయిందని చిత్రీకరించాడు. యువతి తల్లిదండ్రులు అనుమానంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శరీరం లోపల బలమైన గాయాలు కావడంతోనే చనిపోయిందని శవ పరీక్షలో తేలింది. సాక్ష్యాలు చెరిపేశారని వల్లబ్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించారు.

Also Read: ప్రేమించింది… పెళ్లి చేసుకోలేదని మరదలును చంపిన బావ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News