Monday, February 24, 2025

వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Vallabhaneni Vasmshi illness

అమరావతి: వైసిపి ఎంఎల్‌ఎ వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మొహాలీలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకటి రెండో రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్‌లో అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీలో వంశీ కోర్సు చేస్తున్నారు. మొహాలీలోని క్యాంపస్‌లో తరగతులకు హాజరవుతున్నారు. ఎడమ చేయి లాగినట్టు అనిపించడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. అతడికి 2డి ఎకో, ఇసిజి వంటి పరీక్షలు నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి వైసిపి తరపున వంశీ ఎంఎల్ఎ గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News