Sunday, December 22, 2024

గుజరాత్‌లో బిజెపి నాయకుడి హత్య

- Advertisement -
- Advertisement -

 

వల్సద్: గుజరాత్‌లోని వల్సద్ జిల్లా వాపి పట్టణ సమీపంలో సోమవారం ఉదయం ఒక ఆలయం వెలుపల కారులో తన భార్య కోసం వేచి చూస్తున్న స్థానిక బిజెపి నాయకుడు ఒకరిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
మోటారుసైకిల్‌పై వచ్చిన దుండగులు ఎస్‌యువిలో తన భార్య కోసం ఎదురుచూస్తున్న శైలేష్ పటేల్ అనే బిజెపి నాయకుడిని మూడు రౌండ్లు కాల్చినట్లు పోలీసులు తెలిపారు. బిజెపి వాపి తాలూకా ఉపాధ్యక్షుడైన శైలేష్ పటేల్ తన భార్యతో కలసి ఆలయంలోకి వెళ్లారని, దర్శనం తర్వాత బయటకు వచ్చిన కారులో తన భార్యకోసం ఎదురుచూస్తుండగా ఈ దారుణం జరిగిందని బిజెపి వాపి తాలూకా అధ్యక్షుడు సురేష్ పటేల్ తెలిపారు.

Also Read: సిమెంట్ ఫ్యాక్టరీలో యువతకు ఉద్యోగాలు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News