Sunday, December 22, 2024

విలువలు, విధానాలు లేని వ్యక్తి డికె అరుణ: వంశీచందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: విలువలు, విధానాలు లేని వ్యక్తి డికె అరుణ సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు డికె అరుణ మారుపేరు అని ఆయన మండి పడ్డారు. అసదుద్దీన్ పిలిస్తే డికె అరుణ ఏంఐఏంలోకి వెళ్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో రూ.15 కోట్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి మహబూబ్ నగర్ ఎంపిగా పోటీ చేస్తానని డికె అరుణ చెప్పిందని గుర్తు చేశారు.

డికె అరుణ డబ్బులు అడిగినట్టు ప్రమాణం చేయడానికి తాను రెడీగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు. ఏ రామ మందిరానికి రమ్మన్నా వస్తానని ఆయన పేర్కొన్నారు. ఈనెల 28 వతేదీ 11 గంటలకు మహబూబ్ నగర్‌లోని టీచర్స్ కాలనీలోని రామ మందిరానికి వస్తానని, దమ్ముంటే డికె అరుణ రావాలని ఆయన ఛాలెంజ్ చేశారు.

రాముడి భక్తురాలు నేనా, డికె అరుణానా అనేది తేలిపోతుందన్నారు. డికె అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే తాను ఏఐసిసి మెంబెర్ అని, డికె అరుణ పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తాను అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శినని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి డికె అరుణ వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు. డికె అరుణది నాకంటే గొప్ప రాజకీయ చరిత్ర ఏం కాదనీ, తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని అయితే డికె అరుణ లాగ బంగ్లాలపై బంగ్లాలు కట్టుకునే వాడినని, డికె అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని డబ్బులు తీసుకొని గద్వాలలో పోటీ ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని, వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకోనని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News