Monday, December 23, 2024

వచ్చే నెలలో వంశీ పైడిపల్లితో మూవీ సెట్స్‌పైకి…

- Advertisement -
- Advertisement -

Vamshi Paidipalli Movie

 

కోలీవుడ్ స్టార్ విజయ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ భారీ ద్వి భాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్, – స్టార్ హీరో రామ్‌చరణ్‌లతో ప్రస్తుతం పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు కూడా. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రాబోతోందంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి బయటికి వచ్చేసింది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోవడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ భారీ ప్రాజెక్ట్ ని త్వరలో పూర్తి చేయాలనే ఆలోచనలో వున్నాడట. విజయ్ నటించిన ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి మూవీని హీరో విజయ్ ప్రారంభించేయాలనుకుంటున్నాడట. అన్నీ కుదరడంతో ఈ యాక్షన్ ఎంటర్ టైనర్‌ని ఏప్రిల్ మొదటి వారంలో లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఇందులో విజయ్‌కి జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశం వుందని, ప్రకాష్ రాజ్ ఇందులో కీ రోల్ పోషించబోతున్నాడని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News