Thursday, January 23, 2025

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బిజెపి అభ్యర్థిగా వంశీ తిలక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్. వంశీ తిలక్ ను బిజెపి హైకమాండ్ ప్రకటించింది. ఇటీవలి వరకు ఆ స్థానం నుంచి శ్రీ గణేశ్ నారాయణన్ పోటీచేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ నారాయణన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిజెపి వంశీ తిలక్ ను ఖరారు చేసింది. కాగా శ్రీ గణేశ్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందినందున ఈ ఉప ఎన్నిక అనివార్యం అయింది. అయితే బిఆర్ఎస్ ఆమె స్థానంలో ఆమె చెల్లెలు గైని నివేదితను పోటీలోకి దింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News