పాట్నా: కోటిన్నర నగదుతో ఎటిఎం వ్యాన్ డ్రైవర్ పరారైన సంఘటన బీహార్ రాష్ర్టంలోని పాట్నాలో చోటు చేసుకుంది.వివరాలోకి వెళితే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పాట్నాలో ఉన్న దన్ కా ఇమ్లీ చౌక్ వద్ద ఎటిఎం సిబ్బంది డబ్బులను ఎటిఎంలో నింపేందుకు వచ్చారు. ఐసిఐసిఐ డిపాజిల్ మెషిన్లలో ఉన్న నగదు తీసి విత్ డ్రా మెషిన్లలో పెట్టాల్సి ఉంది.యితే దన్‌కా చౌక్ వద్ద పార్కింగ్ సమస్య తలెత్తడంతో డ్రైవర్ సూరజ్ వ్యాన్ ను కొంత దూరంలో పార్క్ చేశాడు.
కస్టోడియన్, క్యాషియర్ ఇద్దరూ బ్యాంక్‌లోకి వెళ్లి అరగంట తర్వాత తిరిగి వ్యాన్ వద్దకు చేరుకున్నారు.వ్యాన్ కనిపించక పోవడంతో సూరజ్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించాడు. ఫిర్యాదు మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు జిఫిఎస్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేశారు. అక్కడికి వెళ్లి చూడగా వ్యాన్ లో డబ్బులు కనిపించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ ను పట్టుకొడానికి స్థానికంగా సిసి కెమెరాల పుటేజిని పరిశీలిస్తున్నారు.