Sunday, December 22, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు ః పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. రుద్రారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఓ దాబా వద్ద ఆగివున్న లారీని చిన్న మంగళవారం, చిట్కుల్ గ్రామాలకు చెందిన పెళ్లి బృద్దం డిసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరి కొందరికి తీవ్రగాయాలైయ్యాయి.

స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. చిట్కుల్ గ్రామాలకు చెందిన పెళ్లి బృద్దం రిసెప్షన్ కు వెళ్లి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డిసిఎంలో ప్రయాణిస్తున్న వారిలో పెల్లి కూతురు, పెళ్లికొడుకు సైతం ఉన్నారు. అయితే వారు  స్వల్ప గాయ పడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు సంగారెడ్డి, పటాన్ చెరు, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News