Thursday, April 3, 2025

వ్యాన్ బోల్తా…పట్టుబడ్డ కోట్లాది డబ్బు

- Advertisement -
- Advertisement -

నల్లజర్ల: నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెమికల్ బస్తాలతో వెళుతున్న వ్యాన్ ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యాన్ బోల్తా కొట్టడంతో డ్రైవర్, క్లీనర్ కు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలెట్టారు. వ్యాన్ అడుగు భాగంలో ఏడు అనుమాస్పద అట్టపెట్టలను పోలీసులు గుర్తించారు. అధికారుల సమక్షంలో వాటిని విప్పి చూడగా భారీ ఎత్తున డబ్బు కట్టలు లభించాయి. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఆ డబ్బు ఎవరిదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఇంత భారీగా డబ్బు లభించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News