Sunday, April 6, 2025

ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన విషాద సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కలబురగి జిల్లా జీవరగి సమీపంలో జీపు అదుపుతప్పి ఆగిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలబురగి ఎస్పీ ఎ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వారిని కలబురగి ఆసుపత్రికి తరలించారు. బాగల్ కోట నుంచి కలబురిగిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News