- Advertisement -
అబ్బా!వానలకు తెంపేలేదు. ఆగే ప్రసక్తే కానరాదు. విర బూసిన మల్లెలు
జలజల రాలినట్లు చిటపట కురిసే
చినుకులకు నేలతల్లి ఒల్లు పులకరించే.
రైతుల మానస విహంగాలు ఆనందగగనాన
స్వేచ్చగా విహరించసాగే
అంతలోనే ఎంతోమోసమాయే…..అతిచే గతిదప్పునన్నట్టు గుసగుసలు మొదలై రసరసలురచ్చరచ్చైనట్టు
మంటికి, మింటికి తెంపులేని
వానధారలతో పులకించిన
నేలమ్మ కలికలయి పాయే
వాగులు వంకలు పోటెత్తి
చెఱువుకుంటలొక్కటాయే
రహదారులు తెగిపాయే
జనులహృదయాలు భయముతో వణికిపాయే
వానదేవుడా! శాంతించు …
గోధుమకుంట పోచయ్య
కొండాపురము
- Advertisement -