కరీంనగర్: సమాజంలో రేపటి తరానికి కాలుష్యం రాకుండా ఉండడానికి మొక్కలు నాటాలని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్య సమతుల్యత పాటించేలా కాలుష్య నియంత్రణ కాపాడాలంటే మొక్కలు నాటాలని, మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలని, అది మనలో అంశం కావాలని, ప్రభుత్వ మొక్కలు పంపిణీ చేస్తుందని, ఎన్ని చేసిన ప్రజల సహకారం కావాలన్నారు. కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ లో 75 వ వన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం ఒక యుద్ధ ప్రతిపాదిపకన ఈ కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. పట్టణంలో ఇంటికి అవసరమైన పండ్లు మొక్కలు, ఇతర అవసరమైన 6 మొక్కలు లాంటివి ఇస్తామని అడిషనల్ కలెక్టర్ చెప్పారని, అధికారులు ఇంటింటికి వస్తారని, ప్రతి ఒక్కరూ ఆ మొక్కను నాటి కాపాడేలా బాధ్యత తీసుకోవాలిని పొన్నం ప్రభాకర్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి పేరు మీద, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు మిద మనకు నచ్చిన వారి పేర్ల మీద మొక్కలు నాటవచ్చన్నారు.
యూనివర్శిటీకి వచ్చినప్పుడు ఇన్ని మొక్కలు లేవని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో యూనివర్శిటీ కి శంఖుస్థాపన చేయడం జరిగిందని, అప్పుడు తాను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నానని, 200 ఎకరాలు యూనివర్సిటీ కి కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు కేసి రెడ్డి, అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణ చేయడంతో పాటు
యూనివర్శిటీ ఇక్కడ ఉండడానికి తాను ఒక కారణమని, తాను ఎంపిగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ తేవడం తో పాటు ఉపాధి కోర్సులు తీసుకొచ్చానని, ఈ బిల్డింగ్ కట్టిన ప్రాంతం కాకుండా మిగిలిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటడంతో పాటు కాపాడుకునే బాధ్యత సిబ్బంది, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. వ్యాధులు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలని, జిహెచ్ఎంసిలో మొక్కలు నాటేటప్పుడు చెప్పామని, కొన్ని మొక్కలు నాటితే చెట్టు మీద పిట్ట వాలదు, గుడు పెట్టదు ,శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయి అంటున్నారని, అలాంటివి మొక్కలు నాట కూడదని, అటవీ శాఖ వారు పర్యవేక్షించిన తరువాతనే మొక్కలు నాటాలని ఆయన తెలిపారు.
మొక్కలు నాటితే శ్వాస రావాలి, పిట్టలు రావాలి, పండ్లు రావాలి, పనికి రాని మొక్కలు నాటి వాతావరణ కాలుష్యం చేస్తే లాభం లేదన్నారు. గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ రాకుండా చూసుకోవాలని, ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేయాలని, మొక్కల నాటే కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజలు సామాజిక బాధ్యతగా భవిష్యత్ తరాన్ని కాపాడడానికి వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ , డిఎఫ్ఒ బాలామణి, డిఆర్డిఒ శ్రీధర్, ఆర్డిఒ వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.