Sunday, January 19, 2025

పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Vanajeevi Ramaiah injured in Road Accident

ఖమ్మం: పద్మశ్రీ వనజివి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బుధవారం ఉదయం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద మొక్కలకు నీళ్ళు పోసెందుకు రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు రామయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు, రామయ్యను ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ వైద్యులతో మాట్లాడి రామయ్య ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామయ్య ఆరోగ్యం మెరుగు అయ్యేందుకు అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకోవాలని ఎంపీ సంతోష్ వైద్యులను కోరారు.

Vanajeevi Ramaiah injured in Road Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News