Sunday, January 19, 2025

వనజీవి రామయ్య ఆరోగ్య బాధ్యత తనదే: ఎంపి సంతోష్

- Advertisement -
- Advertisement -

పచ్చదనం పెంచటంలో ప్రతి ఒక్కరిదీ బాధ్యత, తమ వంతుగా అందరూ మొక్కలు నాటాలి
పర్యావరణ రక్షణ దిశగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి భేష్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం, ఎంపి సంతోష్ కుమార్‌కు ప్రకృతి దీవెనలు ఉండాలి
హరితనిధికి నా వంతుగా స్వయంగా పెంచిన ఎర్రచందనం చెట్లను అటవీ శాఖకు బదిలీ చేస్తాం
వనజీవి రామయ్య ఆరోగ్య బాధ్యత తనదే ః ఎంపి సంతోష్
మన తెలంగాణ/హైదరాబాద్: అనేక దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ, వనాలు పెంపతూ వనజీవిగా పద్మశ్రీ అందుకున్న రామయ్య ప్రగతి భవన్‌లో రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్‌ను కలిశారు. తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. దేశమంతా పచ్చబడాలని హరిత సంకల్పంతో మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అత్యంత విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని ఈ సందర్భంగా రామయ్య దంపతులు ఆకాంక్షించారు. వారికి పాదాభివందనం చేసి సంతోష్‌కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం మన ముందు ఉన్న సవాల్ పర్యావరణ మార్పులను ఎదుర్కొనటమే అని, ఇందుకు పరిష్కారం ఉన్న అడవులు కాపాడుతూ, కొత్తగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచటమే అని రామయ్య అన్నారు. హరితనిధికి తన వంతుగా స్వయంగా నాటి పెద్ద చసిన 20 టన్నుల విలువైన ఎర్రచందనం చెట్లను ప్రభుత్వానికి అందిస్తానని వెల్లడించారు. ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణ కృషి చేస్తున్న రామయ్య దంపతులను కలవటం ఆనందంగా ఉందని సంతోష్‌కుమార్ అన్నారు. ఈ సందర్భంగా రామయ్య ఆరోగ్య పరిస్థితులపై ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ ఆరా తీశారు. ఎలాంటి వైద్యం కావాలన్నా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. రామయ్య నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించేందుకు ఎంపి సంసిద్ధత తెలిపారు.
ట్విట్టర్ ద్వారా వెల్లడి
వనజీవి రామయ్య దంపతులను కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్సాహభరితంగా ఉండే జంట వనజీవిరామయ్య, ఆయన జీవిత భాగస్వామిని కలవడం గౌరవంగా ఉందన్నారు. తమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవను ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉందని వారి నుండి మంచి మాటలు రావడం మరిచిపోలేని అనుభూతన్నారు. రామయ్య గారూ.. అమ్మగారూ ఇద్దరికీ ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Vanajeevi Ramaiah meets MP Santosh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News