Sunday, December 22, 2024

వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలి

- Advertisement -
- Advertisement -

వనమా వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
వనమా రాఘవ దిష్టిబొమ్మ దహనం

మన తెలంగాణ/మధిర : మల్లారం క్రాస్ రోడ్డు రామకృష్ణ కుటుంబం మొత్తం ఆ త్మహత్య చేసుకోవడానికి కారణమైన వనమా రాఘవేంద్ర రావు ను, కఠినంగా శి క్షించాలని, వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖమ్మం జిల్లా సమితి పిలుపు మేరకు మల్లారం క్రాస్ రోడ్ లో వైరా మధిర ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి వనమా రాఘవ దిష్టిబొమ్మను మల్లారం సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఐ మధిర మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ మల్లారం గ్రామ శాఖ కార్యదర్శి సొసైటీ డైరెక్టర్ మందడపు రామారావు మా ట్లాడుతూ,పాలవంచ లో నాగ రామకృష్ణ తన భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం వెనుక కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు రాఘవేంద్ర రావు బెదిరింపులు ఉ న్నట్లు మృతుడు సెల్ఫీ ద్వారా మరణ సమయంలో పేర్కొన్న అంశాన్ని గమనంలో కి తీసుకుని అతనిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్, మల్లారం గ్రా మ శాఖ మాజీ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వరరావు, గ్రామ శాఖ సహాయ కార్యదర్శులు కొంగర మురళీకృష్ణ, గరిడేపల్లి వెంకటేశ్వరరావు, గ్రామ శాఖ నాయకులు మందడపు అప్పారావు, పరుచూరు రామారావు, మందడపు ప్రఫుల్, మందరపు రామకృష్ణ, బట్ట కృష్ణారావు, మెట్టల సతీష్ ,మెట్టెల రమ కొంగర నరేంద్ర, మొగిలి మారేసు గొల్లమందల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News