Sunday, December 22, 2024

వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.

కాగా, 2018 ఎన్నికల్లో అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని హైకోర్టును సమీప అభ్యర్ధి జలగం వెంకటరావు ఆశ్రయించడంతో వాదోప వాదనలు విన్న తర్వాత వనమా అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు వెల్లడించింది. దీంతో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News