Friday, December 20, 2024

వానమ్మ… రావమ్మా

- Advertisement -
- Advertisement -
  • కరుణ చూపని వరుణుడు
  • అరకొర వానలతో పంటల సాగు
  • సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం ప్రశ్నార్థంగా మారింది
  • వర్షం కోసం రైతుల ఎదురు చూపులు

సంగారెడ్డి: నైరుతి రుతుపవనాలు దోబుచులాడుతున్నాయి. రుతుపవనాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న రైతులు ఊసురు మంటున్నారు. వానలు సరిగా లేక పంటల సాగు ప్రశ్నార్థంగా మారింది. సంగారెడ్డి జిల్లాలో వర్షం కురవక పోవడంతో రైతులు కలవరపడుతున్నారు. వర్షాలు రైతులను పలకరించి పంటలు సాగు చేసేదాక ఆశలు రేపాయి. వరుణ దేవుడు కరుణించి ఆకాశం మేఘావృతం కాగానే వాయుదేవుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గాలీ వీస్తుండడంతో మేఘాలు తట్టుకోలేక ఫలాయనం చెందుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్, మునిపల్లి, ఝరాసంగెం, జోగిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్‌చెరు మండలాల్లో రైతుల పత్తి విత్తనాలు నాటిన సరైన వర్షాలు లేక మొక్కలు ఎదగలేకుండా పోయాయి. విత్తనాలు నాటిన తర్వాత సరైన వానలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంటకు రైతులు నారుమళ్లను సిద్ధ్దం చేసిన వర్షాలు కురవక పోవడంతో వరి వేసేందుకు రైతులు వెనకంజ వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News