Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ సహకారంతో వనపర్తి జిల్లా అభివృద్దిలో అగ్రస్థానం:  మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహకారంతో వ్యవసాయరంగంలో వనపర్తి జిల్లాను అగ్రస్థానంలో నిలబెడతానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అభ్యర్థుల జాబితా ప్రకటించిన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు.

విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం, ఉపాధి రంగాలలో వనపర్తిని అభివృద్ధి చేశానని లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చినట్లు తెలిపారు. దశాబ్దాలుగా వనపర్తి ప్రజల కల రహదారి విస్తరణ పూర్తి కావస్తున్నది ప్రతి గ్రామం, తండాలకు బిటి రహదారులు తీసుకువచ్చానని ప్రతి గ్రామంలో వీధివీధినా సిసి రహదారులు నిర్మించినట్లు చెప్పారు. మిగిలిపోయిన సమస్యలు భవిష్యత్ లో పరిష్కరిస్తానని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News