హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఇద్దరు దొంగలను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 207 గ్రాముల బంగారు ఆభరణాలు, 1092 గ్రాముల వెండి వస్తువులు, రూ.8,000 నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ డిసిపి సన్‌ప్రీత్ సింగ్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా, ఆత్మకూరు మండలం, అమరచింత గ్రామం, చంద్రప్ప తండాకు చెందిన వార్దావత్ వెంకటేష్ నాయల్ నగరంలోని లాలాగూడలోని బుద్ద నగర్‌లో ఉంటూ పేయింటర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్, తుకారాంగేట్‌కు చెందిన గోపాల్ నాయక్ అలియాస్ వినోద్ నాయక్ అలియాస్ వీణా అలియాస్ వినోద్ కూలీ పనిచేస్తున్నాడు. నిందితులు ఇద్దరు గతంలో మహబూబ్‌నగర్ రూరల్ పిఎస్, నర్వా పిఎస్, కొండాపూర్, చేవెళ్లలో చోరీలు చేశారు.
పోలీసులు అరెస్టు చేయడంతో జైలుకు వెళ్లి బేయిల్‌పై తిరిగి వచ్చారు. ఇద్దరు నిందితులు కలిసి వనస్థలిపురం, జవహర్‌నగర్, మేడిపల్లి, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశారు. ఇద్దరు కలిసి పల్సర్ బైక్‌పై నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను కనిపెడుతున్నారు. రాత్రి సమయంలో తాళాలను పగులగొట్టి చోరీలు చేస్తున్నారు. ఇంట్లోని బంగారు, ఆభరణాలు, నగదు చోరీ చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు నిందితులపై 16 కేసులు ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ మురళిమోహన్, డిఐ జగన్నాథం, ఎఎస్సైలు సుధాకర్ రెడ్డి, పిసిలు బాలరాజు, కృష్ణయ్య, బాబు చారీ, లలితా కిరణ్ తదితరులు పట్టుకున్నారు.