- Advertisement -
వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం ఉదయం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.కేరళ చెందిన సుమేష్ డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎల్ బి నగర్ కు ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి ఎండిఎంఎ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నాడు. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాసులకు డ్రగ్స్ అమ్ముతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం సుమేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఎవరి వద్ద నుంచి తీసుకొచ్చి డ్రగ్స్ అమ్ముతున్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హైదరాబాద్ శివారులో ఎవరెవరికి అమ్మిన వివరాలను కూడా సేకరిస్తున్నారు.
Also Read: భారత్-అమెరికా డిఎన్‌ఎలోనే ప్రజాస్వామ్యం: మోడీ
- Advertisement -