Monday, December 23, 2024

మెగా గ్యాస్ పైప్‌లైన్ పనులను నిలిపి వేయాలని కమిషనర్‌కు వనతి

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్ ః చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో మెగా గ్యాస్ సంస్థ వారు చేపడుతున్న ఇంటింటికి గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు పనులను నిలిపి వేయించాలని కోరుతూ శుక్రవారం పోలోజు శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. పైప్‌లైన్ వేసేందుకు మెగా సంస్థ వారు రూ. 1 కోటి 50 మాత్రమే చెల్లించి కేవలం 130 కిలోమీటర్లకు మాత్రమే మున్సిపల్ నుంచి అనుమతి పొందారన్నారు.

కానీ వాస్తవంగా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే మాత్రం 300 కిలోమీటర్ల పైప్‌లైన్ వేయడం జరుగు తుందన్నారు. దీంతో మున్సిపల్ రూ. 3 నుంచి 4 కోట్ల మేర మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందన్నారు. బదిలీపై వెళ్లిన కమిషనర్ కె.నర్సింహ్మారెడ్డి మెగా సంస్థకు కారు చౌకగా అనుమతులు ఇవ్వడం వెనుక అక్రమాలు జరిగాయని కౌన్సిలర్లు ఆరోపించారు. కాబట్టి తక్షణమే పైప్‌లైన్ ఏర్పాటు పనులను ఆపివేయించి అక్రమాలపై విచారణ చేపట్టాలని వారు కమిషనర్ భాస్కర్‌రెడ్డికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్లు సైదులుగౌడ్, మంజుల,విజయ, శైలజ, విజయ,వరమ్మ లు వున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News