Monday, November 18, 2024

వందేభారత్ స్పీడ్ 83 కిలోమీటర్లే..

- Advertisement -
- Advertisement -

మన వందేభార త్ రైలు స్పీడ్ గంటకు 180 కిలోమీటర్ల వే గం. కానీ, ఆ రైలు యావరేజ్ స్పీడ్ 83 కిలోమీటర్లే. ఓ ప్రయాణికుడు వందేభారత్ రైలుకు సంబంధించి ఆర్టీఐలో ఈ సమాచారాన్ని అడగడంతో ఈ విషయం బయటపడింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సగటున గంటకు  83 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. నిజానికి ఈ రైళ్ల స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. కానీ, రైల్వే ట్రాకులు సరిగా లేని కారణంగా ఆ రైళ్లు కేవలం గంటకు 83 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు ఓ ఆర్టీఐ ద్వారా తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వందేభారత్ రైళ్ల స్పీడ్ గురించి తెలుసుకోవాలని ఆర్టీఐ కింద ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే రైల్వే శాఖ ఇచ్చిన సమాధానంలో 2021,-22 సీజన్‌లో వందేభారత్ రైళ్లు సగటు 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఇక 2022-, 23 సంవత్సరంలో ఆ రైళ్లు సగటున కేవలం 81.38 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. ఈ రైళ్లకు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే సామర్థ్యం ఉన్నా ట్రాక్ కండీషన్స్ దృష్ట్యా ఆ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా స్పీడ్ ఫిక్స్ చేశారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడం లేదని రైల్వే శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ విషయం వెల్లడయ్యింది. వీటితో పాటు ముంబై- టు షిర్డీల మధ్య నడిచే వందేభారత్ రైలు సగటున గంటకు 64 కిలోమీటర్ల వేగంతో, లోయెస్ట్ యావరేజ్ స్పీడ్‌తో, ఇక న్యూఢిల్లీ- టు వారణాసి మధ్య నడిచే రైలు అధికంగా గంటకు 95 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని రైల్వే శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News