హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. దీనిని ప్రస్తుతం 10వ ప్లాట్‌ఫాం పక్కన నిలిపిఉంచారు. నేడు (ఆదివారం) సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరుగనుండగా ప్రధాని మోడీ దీనిని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలుకు సంబంధించి టైమ్‌టేబుల్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతోపాటు ఈ నెల 16వ తేదీ రెగ్యులర్‌గా ప్రయాణికులకు ఈ రైళ్లు సేవలు అందించనున్న నేప్యథంలో వందే భారత్ రైలుకు సంబంధించి ఛార్జీల వివరాలను రైల్వే శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి ప్రయాణానికి సంబంధించి ప్రయాణికులు టికెట్‌లను బుక్ చేసుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే రైల్వే శాఖ ఐఆర్‌సిటిసి ద్వారా బుకింగ్‌ను సైతం ప్రారంభించింది.
వెబ్‌సైట్‌లో చార్జీల వివరాలు
విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు నెంబర్ 20833, సికింద్రాబాద్- టు విశాఖ రైలుకు 20834 నంబర్‌ను రైల్వే శాఖ కేటాయించింది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్ టికెట్ ధర రూ.1,720లుగా, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధరను రూ.3,170లు రైల్వే అధికారులు నిర్ణయించారు. అలాగే సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.905లు (చైర్ కార్), రూ.1775లుగా (ఎగ్జిక్యూటివ్ క్లాస్), ఇక సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రూ.1365 (చైర్ కార్‌కు), రూ.2485లు (ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు) (క్యాటరింగ్ ఛార్జీలతో కలిపి) టికెట్ ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ చార్జీలను ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆహారం వద్దనుకుంటే చార్జీలు రద్దు
ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు (20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఈ రైలు (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మార్గమధ్యలో రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఇందులో మొత్తం 14 ఏసి చైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు. వందే భారత్‌తో ప్రయాణికులకు కేటరింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రెండు రకాలుగా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రయాణికులు ఒకవేళ ఈ ఆహారం వద్దనుకుంటే కేటరింగ్ ఛార్జీలు ఉండవు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూల్‌ను బట్టి అందించే ఆహార పదార్థాల్లో మార్పులు ఉంటాయి. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట భోజనం అందిస్తారు.
చార్జీల వివరాలు ఇలా
(ఎసి చైర్‌కార్‌కు)
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు – రూ. 1,720లు
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 625లు
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌కు – రూ. 960లు
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 1,115లు
విశాఖపట్నం నుంచి వరంగల్‌కు- రూ. 1,310లు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 1,665
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి – రూ. 1,365
సికింద్రాబాద్ విజయవాడ జంక్షన్ వరకు – రూ. 905లు
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు – రూ. 750లు
సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు- రూ. 520లు
ఎగ్జిక్యూటివ్ ఎసి చైర్‌కార్‌కు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు – రూ. 3,170లు
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 1,215లు
విశాఖపట్నం విజయవాడ జంక్షన్ వరకు – రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 2,130లు
విశాఖపట్నం నుంచి వరంగల్‌కు- రూ. 2,540లు
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 3,120లు
సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి – రూ. 2,485లు
సికింద్రాబాద్ విజయవాడ జంక్షన్ వరకు – రూ. 1,775లు
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు – రూ. 1,460లు
సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు- రూ. 1,005లు