- Advertisement -
జమ్మూకశ్మీర్ రైల్ కనెక్టివిటీకి మరో సరికొత్త ఊతం లభించింది. భారతీయ రైల్వేస్ శనివారం ప్రత్యేకంగా రూపొందించిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జి మీద ట్రయల్ రన్‌గా నడిపించింది. శ్రీ మాతా వైష్ణవి దేవి కత్రా(ఎస్‌విడికె) రైల్వే స్టేషన్ నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ వరకు ఈ ట్రయల్ రన్ నడిపించింది. ఈ రైలును ఇదివరకే భారత తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జి అయిన అంజి ఖడ్ బ్రిడ్జి మీద కూడా నడిపించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 11.30 గంటలకు జమ్ములో కాసేపు ఆగింది. ఆ రైలు స్టేషన్‌లోకి వచ్చినప్పుడు భారతీయ రైల్వేస్‌ను పొగడుతూ నినాదాలు, ప్రశంసలు వినిపించాయి. ఆ తర్వాత ఆ రైలు తన ట్రయల్ రన్‌ను పూర్తిచేసేందుకుగాను తదుపరి స్టేషన్ అయిన బుడ్గాం స్టేషన్ వైపుకు కదిలిపోయింది.
- Advertisement -