Sunday, January 19, 2025

24న బెంగళూరుకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

610 కిలోమీటర్ల దూరం 8.30 గంటల్లోనే పూర్తి
వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

కాచిగూడలో పాల్గొననున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. వినాయక నవరాత్రుల కానుకగా.. కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభిచనుంది. 24 తేదీనుంచి కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కాచిగూడలో జరిగే కార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News