Monday, December 23, 2024

ఇక సామర్లకోటలో ఆగనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

కాకినాడ: విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సామర్లకోట్ స్టేషన్‌లో హాల్ట్‌ను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ అనే నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయితే కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అంకితభావంతో కృషి చేయడంతో కాకినాడ జిల్లా వాసుల సౌకర్యార్థం సామర్లకోటలో హాల్ట్‌ను చేర్చేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆమోదం తెలిపారు.

రైల్వేశాఖ ప్రకటించిన కొత్త షెడ్యూల్‌ ప్రకారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరే వందేభారత్ రైలు ఇకపై సామర్లకోటలో ఉదయం 7.14 గంటలకు ఆగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు కూడా సామర్లకోటలో రాత్రి 9.34 గంటలకు ఆగుతుంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సామర్లకోటలో హాల్ట్ ఇచ్చిన సందర్భంగా సామర్లకోటలో రైలుకు ఘన స్వాగతం పలికి వైఎస్ఆర్సీపీ ఎంపీ వంగా గీత, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన, బిజెపి నాయకులు కొబ్బరి కాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News