Sunday, October 6, 2024

ఆగస్టు 15 నాటికి వందేభారత్ స్లీపర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుతం చైర్‌కార్ సర్వీసులకే పరిమితమైన వందేభారత్ రైళ్లు మరో రెండు నెలల్లో అంటే ఆగస్టు 15 నాటికి స్లీపర్ సౌకర్యంతో అందుబాటులోకి రానున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ దీనిని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందేభారత్ స్లీపర్ రైలు పనులను పర్యవేక్షించడానికి బెంగళూరు వెళ్లారు. వందేభారత్ స్లీపర్ రైలు తయారీ చివరిదశలో ఉందని ఆయన వెల్లడించారు.

దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఢిల్లీ, ముంబై రైల్వే మార్గంలో నడుస్తుందని, రద్దీగా ఉండే ఈ మార్గంలో స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. స్లీపర్ రైలు ఢిల్లీ నుంచి భోపాల్, సూరత్ మీదుగా ముంబై చేరుకుంటుందని తెలిపాయి.

స్లీపర్ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 10 థర్డ్ ఎసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ప్లస్ ఏసీకి కేటాయించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీటింగ్‌తోపాటు లగేజీకి రెండు బోగీలు అందుబాటులో ఉంటాయి. గంటకు 130 కిమీ వేగంతో నడిచే ఈ రైలు వేగాన్ని కొద్ది రోజుల తరువాత క్రమంగా గంటకు 160220 కిమీలకు పెంచనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News