Sunday, January 19, 2025

తెలంగాణకు మరో వందే భారత్ రైలు

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపింది రైల్వే శాఖ. తెలంగాణకు మరో వందే భారత్ రైలును ప్రకటించింది. సికింద్రాబాద్ నుండి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుండి ఈ కొత్త సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దీనిని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రైలు నాగపూర్ నుండి ఉదయం 5 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12.15 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

తిరిగి సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గం.లకు నాగపూర్ చేరుకుంటుంది. కాగా కాజీపేట, రామగుండం, బళ్లార్ష, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. సికింద్రాబాద్, నాగపూర్ నగరాల మధ్య 578 కిమీల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో చేరుకుంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా.. ఇది ఐదవది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News