Monday, December 23, 2024

ఆవును ఢీకొట్టిన వందేభారత్ రైలు

- Advertisement -
- Advertisement -

Vande Bharat train hit a cow

రెండు రోజులలో రెండు ప్రమాదాలు

వడోదరా /న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో మరో అపశృతి నెలకొంది. శుక్రవారం ఈ రైలు మార్గమధ్యంలో ఓ ఆవును ఆనంద్ స్టేషన్ వద్ద ఢీకొంది. ఈ ఘటనలో ఆవు పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు. అయితే ఈ ట్రైన్ ఇంజిన్ ముందు భాగం కొంత మేర దెబ్బతిందని అధికారులు తెలిపారు. ఒక్కరోజు క్రితమే ఈ రైలు గేదెల మందను ఢీకొంది. ఇప్పుడు ఆవును ఢీకొనడంతో బంపర్‌కు పగుళ్లు ఏర్పడి పది నిమిషాల పాటు ప్రయాణం నిలిపివేశారు. పట్టాల పక్కన సంచరించే పశువులతో రైలు ఢీకొనడం వంటి ఘటనలు సర్వసాధారణం, వీటిని తప్పించలేమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో స్పందించారు. అయితే రైలు డిజైన్‌ను ఈ ఘటనల నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తదుపరి చర్యలు తీసుకోవల్సి ఉందన్నారు. ఇప్పటి డిజైన్ మేరకు ముందు భాగాన్ని అవసరం అయినప్పుడు మార్చుకునేందుకు వీలుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కంజరీ ఆనంద్ స్టేషన్ల మధ్య రైలు ఘటన జరిగిందని వెస్టర్న్ రైల్వేల ప్రజా సంబంధాల ప్రదాన అధికారి సుమిత్ ఠాకూర్ తెలిపారు. ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నారని వివరించారు. వందేభారత్ రైలు గాంధీనగర్ ముంబై మధ్య నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News