Saturday, November 23, 2024

కేరళలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు….. ధ్వంసమైన విండ్‌షీల్డ్

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం: కేరళలో కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వాలు. కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తిరునవయ, తిరూర్ స్టేషన్ల మధ్య రాళ్లు రువ్వినట్లు దక్షిణ రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 25న తిరువనతపురం సెంట్రల్ స్టేషన్‌లో కేరళలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.  రాళ్లు రువ్విన సంఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఒక బోగీకి చెందిన విండ్‌షీల్డ్ దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేశారు. రైలుకు భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

కాగా..ఏప్రిల్ 6వ తేదీన విశాఖపట్నంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన సంఘటన వెలుగు చూసింది. గత మూడు నెలల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై రాళ్లు రువ్వడం ఇది మూడవ సంఘటన. ఆకతాయిలు రువ్విన రాళ్లకు బోగీకి చెందిన కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని దికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి వెళుతున్న వందే భారత్ రైలుపై ఖమ్మం, విజయవాడ మధ్య కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు వాల్టేరు డివిజన్ రైల్వే తెలిపింది. జనవరిలో..మెయిన్‌టెయినెన్స్ సందర్భంగా కంవిశాఖపట్నం సమీపంలోని కంచర్లపాలెం వద్ద వందే భారత్ రైలుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వగా ఒక బోగీకి చెందిన కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News