Monday, December 23, 2024

ఉదయ్‌పూర్- జైపూర్ వందేభారత్‌ కు తప్పిన ముప్పు

- Advertisement -
- Advertisement -

ఉదయ్‌పూర్ : రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్- జైపూర్ వందేభారత్ రైలుకు సోమవారం బ్రేక్ పడింది. ఈ మార్గంలో వెళ్లుతున్న ఈ 20979/20980 నెంబరు రైలు పట్టాటపై భారీ స్థాయి రాళ్లు వేసి ఉండటం గమనించిన ఈ లోకోమోటివ్ పైలట్లు (డ్రైవర్లు) సకాలంలో స్పందించి రైలును నిలిపివేశారు. వందేభారత్ రాకపోకలను నిలిపివేసేందుకే ఈ విధంగా ఎవరో ఆటంకాలు కల్పించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలు తలెత్తాయి. ఎంతో అప్రమత్తతతో డ్రైవర్లు ఉన్నందునే ఘోర ప్రమాదం తప్పిందని నార్త్‌వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. డ్రైవర్లు ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి రైలును నిలిపివేశారు గంగారార్ సొనియానా సెక్షన్‌లో ఉదయం 9గంటల 55 నిమిషాల ప్రాంతంలో రైలు పట్టాలపై కొన్ని రైళ్లు, ఓ అడుగు ఇనుపకడ్డీ పెట్టి ఉన్నట్లు తెలిపే వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ సెక్షన్‌లో చిత్తోర్‌గఢ్ స్టేషన్ దాటిన తరువాత రైలు నిలిపివేయాల్సి వచ్చింది. తమ రైలు ప్రయాణంలో ఎదురైన ఈ పరిస్థితి గురించి తల్చుకుంటేనే తమకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఓ ప్రయాణికుడు తెలిపారు.

ఈ రాళ్లు పడేసిన ఘటనపై వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, స్థానిక పోలీసుతో కలిసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఉదయ్‌పూర్ జైపూర్ వందే భారత్ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తుంది. గడిచిన నెల సెప్టెంబర్ 24ననే ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన పలు వందేభారత్ రైళ్లలో ఈ రైలు కూడా ఉంది. ముప్పు తలపెట్టే విధంగా ఈ రైలు మార్గంలో అడ్డంకులు కల్పించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సమాజంలో అత్యంత క్రూరమైన జంతువులు ఉన్నాయని, ప్రజల ప్రాణాల గురించి వీరికి ఖాతరు లేదని ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా ట్వీటు వెలువరించింది. ప్రధాని మోడీ తరచూ దేశంలో అత్యంత అధునాతనమైన వందేభారత్ రైళ్లను మరింతగా ప్రవేశపెడుతామని, ఇది తమ ఘనత అని తెలియచేసుకుంటున్నారు. అయితే సామాన్య ప్రయాణికుడికి అందని ఛార్జీలతో తమ మజిలీలలో నిలవకుండా సాగే ఈ రైళ్లపై స్థానికులలో నిరసన వ్యక్తం అవుతోంది. పలు చోట్ల వందేభారత్ రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు జరిగాయి. రైల్వేలు ఆధునీకరణ పేరిట ప్యాసింజర్ ఇతరత్రా అనువైన రైలు సర్వీసులు వేలకొద్ది నిలిపివేశారని, అత్యున్నత వర్గాలకు వీలుగా ఉండే వందేభారత్ వంటి రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని జనం నుంచి విమర్శలు ఎదురయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News