Saturday, November 23, 2024

గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకున్న వందేభారత్ రైలు

- Advertisement -
- Advertisement -

Vande Bharat train speed of 180km per hour recorded in trial run

న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 2019లో వందేభారత్ తొలి రైలు అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీవారణాసి రూట్‌లో తొలుత దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీవైష్ణోదేవి( జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా కోటా( రాజస్థాన్) నగ్దా (మధ్యప్రదేశ్) సెక్షన్‌లో ట్రయల్న్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. రైలు వేగాన్ని కొలిచే స్పీడోమీటర్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 180 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోవడం అందులో కనిపించింది. ఈ రైళ్లకు విడిగా ఇంజన్ ఉండదు. ఈ తరహా రైళ్లు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News